| కవితలు | యెంకి పాటలు |
| 3. యెంకి ముచ్చట్లు |
|
యెన్నాని సెప్పేది యెంకి ముచ్చట్లు యేటి సెప్పేది నాయెంకి ముచ్చట్లు దొడ్డితోవకల్లె తొంగి సూడంగానే తోటకాడే వుండు త్వరగొస్త నంటాది యెన్నాని సెప్పేది... |
|
యెంకి రాలేదని యెటో సూత్తావుంటె యెనకాలగా వచ్చి 'యెవురువో' రంటాది యెన్నాని సెప్పేది... |
|
'సిట్టి సేబా' సాని నిట్టూర మేత్తుంటె మాటా యినబడనట్టు మరియేటో సెపుతాది యెన్నాని సెప్పేది... |
|
'కోడిగూసేసరికి కొంపకెల్లాలి నీ కోసరమె సెపుతాను కోపమొ' ద్దంటాది యెన్నాని సెప్పేది... |
|
'యెంతసేపున్నాను యిడిసి పెట్టాలేవు తగువోళ్ళలో మనకు తలవొంపు' లంటాది యెన్నాని సెప్పేది... |
|
యెనకెనక సూత్తానె యెల్లుతా వుంటాది యెన్నాని సెప్పేది యెంకి ముచ్చట్లు యేటి సెప్పేది నాయెంకి ముచ్చట్లు |