| బాల సాహిత్యము | బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి | అయిదు వ్రేళ్లు |

| అయిదు వ్రేళ్లు |
చుట్టాలసురభి - బొటనవ్రేలు కొండేల కొరివి - చూపుడువ్రేలు పుట్టుసన్యాసి - మధ్యవ్రేలు ఉంగరాలభోగి - ఉంగరపువ్రేలు పెళ్లికిపెద్ద -చిటికెనవ్రేలు |
| * * * |
తిందాం తిందాం ఒకవేలు! ఎట్లా తిందాం ఒకవేలు? అప్పుచేసి తిందాం ఒకవేలు! అప్పెట్టా తీరుతుంది ఒకవేలు? ఉన్నాగదా నేను అన్నింటికీ పొట్టివాణ్ణి, గట్టివాణ్ణీ బొటనవేలు! (చిటికన వ్రేలు, ఉంగరము వ్రేలు, నడిమివ్రేలు, చూపువ్రేలు, బొటనవ్రేలు, అని అయిదు వ్రేళ్ల పేళ్లు, ఈ అయిదు వ్రేళ్ళూ అనుకొన్నట్టు ఒక్కొక్క వ్రేలినీ చూపుకుంటూ బాలకు లీ పదములు పాడుదురు.) |