| బాల సాహిత్యము | బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి | చలికంఠము |

| చలికంఠము |
చలి చలి చలి చందాయమ్మ, గొంగళి గప్పుకో గోనాయమ్మ, వడ వడ వడ వడ వణికేనమ్మ, చలిమంటకు చితుకులు తేవమ్మ. |
(చలికాలము పసిపిల్లలు కంఠముచుట్టు చిక్కనిబట్ట మడతపెట్టి రెండుమూడు చుట్లు కాళ్లదాకా వచ్చేటట్లు చుట్టించుకొని మెడపక్కను ముడివేయించుకుంటారు. దానిపేరు చలికంఠము. చిదుకులతో చిన్ని మంటవేసి దానికికొంచెం దూరంగా కూర్చుంటారు. దానిపేరు చలిమంట. చలికి వణుకుతూ ఈ పదము పాడుతారు.)