| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
001. వానదేముడా
| అనాది యని పరిగణింపబడే వేదవాఙ్మయంలోనే ఎన్నో ఋక్కులు పంటలను కీర్తిస్తున్నవి. సుజలమూ సుఫలమూ సస్యశ్యామలమూ అయిన భారతావనిలో వ్యవసాయమే నిత్యపరిశ్రమా జీవనాధారమున్నూ. అందువల్లనే, |
|
వానల్లు కురవాలి వానదేముడా వరిచేలు పండాలి వానదేముడా నల్లాని మేఘాలు వానదేముడా చల్లంగ కురవాలి వానదేముడా చేలన్ని నిండాలి వానదేముడా మూనాలు యెదగాలి వానదేముడా యెన్నులు వెయ్యాలి వానదేముడా పన్నుగ సేలన్ని వానదేముడా పంటల్లు పండాలి వానదేముడా భాగ్యాలు నింపాలి వానదేముడా పండుగలు సేత్తాము వానదేముడా మావూరి చెరువైన వానదేముడా ముంచెత్తి పోవాలి వానదేముడా కప్పలకు పెళ్ళి వానదేముడా గొప్పగ సెయ్యాలి వానదేముడా |
| అని ప్రార్థిస్తారు జనపదాలలోని జనులందరూ. చల్లగా కురవవలెనట వానదేవుడు! మొనలు ఎదగాలి, వెన్నులు వెయ్యాలి. చండదిగ్వేదండతుండ నిభాఖండవారి ధారలు కవులకు వలె కర్షకులకు అక్కరకు రావు. చెరువులు ముంచెత్తిననే, కప్పలకు పెళ్ళిళ్ళు భోరు కలంగిననే భాగ్యాలు నిండగలవు. |