| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
009. కోతపాట
| కోత కొయ్యండమ్మలాలా సేలు కోరుకున్నా మమ్మలాలా ఆరు మూడు కాలమైన అసలుకి మరి కొసరు లేదు | ... కోత |
|
సోడిసేలు యెన్నులేసి సోలెడు గింజలకైతే పాలికాపు బత్తేలకు సాలొచ్చును కొయ్యండీ | ... కోత |
|
దసరా భోగాలంటె అసరా తీరుస్తాయి పసరాలకి కసవుంటే భాగ్యాలే పండాయి | ... కోత |
|
సాలొచ్చిన మారాజు సెయిముల గాయిస్తాడు కాసు సేత పడితేను గగనమందేము సేను | ... కోత |
| రైతుకు చాలి వచ్చిననే చెయ్యిములగా గింజలు కూడా కూలివాళ్ళకి ఇస్తాడు. లేకపోతే ఒప్పుకున్న కాసు మాత్రమే. |
| వరిపొలాలకు ఈ చిక్కు లేదు. వర్షపాత మెట్లున్నా 'మన్నెపుగొండ పై మబ్బులో మెరుపు తీసిపోయిన నదిని పోషించి' పంట కందించగలదు. వరిచేల లోని చిక్కులు వేరు. |