| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
010. కోత పాట
| కొయ్యండల్లా కొయ్యండీ కోసీ బణుపూ లెయ్యండీ వానల వరదల వంగినసేను వెన్నుల నీనిన వన్నెలసేను తిన్నగదీసీ మొదలూ కోసీ పనలన్నీని పొంజెట్టావా గింజలు బందలొ పడిపోకుండా పొందుగ వెన్నులు కొయ్యండల్లా కాలం సూత్తే సీతాకాలాం కొడవలి పాటూ జాగర్తల్లా కాలూసెయ్యీ ఆడింతేనే కుండలొ కూడు కలిసొత్తాది |
| పని చేస్తున్నపుడు పాడే పాటల వస్తువు ఆపనికి సంబంధించినదే. దేవాలయ గోపురానికి అలంకారాలు ఆ గోపురపు హ్రస్వరూపములే. భారత దేవాలయాన్ని అలంకరించినమనసులే ఈ బృహదాంధ్ర సారస్వతాన్ని నిర్మించినది. |