| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
013. పొలిగాడు
| పొలిగాడు పంటలను సిద్ధింపజేసే దేవుడు. ఎక్కడైనా కుప్పనూర్పులు జరుగుతుంటే, పొన్నలన్నీ దాటి పొలిగాడు అక్కడ తయారు! |
|
ఒలియా ఒలియా ఒలియా రావేలు గలవాడ రార పొలిగాడ తూర్పునా ఒకవాన తుమ్మెదల మోత పడమట ఒకవాన పట్టికురవంగ ఈ వాన ఆ వాన ఏక జడివాన ఏవిలీ చేసుకూ ఎడవానలాయె వెండి తూముల కింద వెల్లడము పండు పైడి తూముల కింద పాలంకి పండు రావేలు పోవేలు రాసి పదివేలు రావేలు మీదయ్య రాసి మాదయ్య పొలో పొలి పొలి పొలి తిరప తెంకన్నిచ్చిన పొలి విను కొండెం కమ్మిచ్చిన పొలి పొలేలుగా చాల పొలి |