| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
014. పొలిపాట
| ఒలియ వొలియ... ఒలియ వొలియా.. వొలియా... కోటేలు గలవాడ రార పొలిగాడా కోటేలు మీదయ్య కొండ మాదయ్య వెయ్యేలు గలవాడ రార పొలిగాడా వెయ్యేలు మీదయ్య వెన్నొమాదయ్య నూరేలు గలవాడ రార పొలిగాడా నూరేలు మీదయ్య నూగు మాదయ్య పదివేలు గలవాడ రార పొలిగాడా పదివేలు మీదయ్య పంట మాదయ్య రావేలు గలవాడ రార పొలిగాడా రావేలు మీదయ్య రాశి మాదయ్య ఎద్దులూ తొక్కంగ ఎదిగినే రాశి కోడెలూ తొక్కంగ కొల్లాయె రాశి పెయ్యలూ తొక్కంగ పెరిగినే రాశి పొలిగాడు కొట్టంగ పోగాయె రాశి వచ్చెనే పొలిగాడు పొన్నలూ దాటీ దాగెనే పొలిగాడు దండా*కొట్టల్లో |
| * కూర్పారబట్టినపుడు ఏర్పడే ధాన్యపు చార. |