| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
016. ఒలియొ ఒలియొ
| ఒలియొ ఒలియొ ఒలియో ఒలియాలే రావేలు గలవాడా రార పొలిగాడా రావేలు మీవయ్యా రాశి మీదయ్యా పొలికాడే గొట్టంగ పోయెరారాశీ వచ్చెరా పొలిగాడు వాయువేగానా పోయెరా పొలిగాడు పొన్నల్లు దాటీ దాగెరా పొలిగాడు దండకట్టుల్ల కోడెలూ తొక్కంగ కొల్లాలై రాశి ఎద్దులూ తొక్కంగ ఎదిగెరా రాశి దున్నలూ తొక్కంగ దిన్నెలై రాశీ పెయ్యలూ తొక్కంగ పెరిగెరా రాశీ శ్రీశైల పర్వతము శిఖదేలె రాశీ తిరుపతిగట్టులా దివ్యమై రాశీ కాళహస్తీ లాగు కళలూరె రాశీ కోటప్పకొండలా గొప్పదై రాశీ మంగళాగిరిలాగ పొంగెరా రాశీ వేదాద్రి గట్టులా వెలిగెరా రాశీ దుర్గగట్టులాగ తోచెరా రాశీ సింహాద్రి గట్టులా చెన్నొందె రాశీ |
| రాశి యెత్తును చూచి కూడా రైతు భగవంతుణ్ణి మరువడు! రాశి అతడు తిరిగె తిరుపర్వతము వలెనే కనపడుతోంది. |