వలియొ వలియొ వలియొ - రాగాల వలియొ రావేలు గలవాడ - రార పొలిగాడా | ॥వలియొ॥ |
| చైట కమ్మరి బిడ్డ - చంద్రుణ్ణి బోలు | " |
| చుట్టుండు కాపూలు - చుక్కల్ల బోలు | " |
| ఊరికి ఉత్తరాన - ఉత్తముడి సైక | " |
| ఉత్తముడి సైకలో - రత్నాల పందిరి | " |
| రత్నాల పందిట్లొ - ముత్యాల కొలిమి | " |
| మానెడు ముత్యాలు - మరుగైన కొలిమి | " |
| తవ్వెడు ముత్యాలు - తరుసైన కొలిమి | " |
| గిద్దెడు ముత్యాలు - గిలకలా కొలిమి | " |
| వేసేటి సంపెట్లు - పిడుగులా బోలు | " |
| లేసేటి రవ్వల్లు - చుక్కలా బోలు | " |
| పల్లాపు చేలాకి - పదునాయె వాన | " |
| గుంటకల నన్నూరు - గొర్రెలు మున్నూరు | " |
| రఘురాము గొర్రుబట్ట - రంభ ఎదబెట్లు | " |
| శ్రీరాము గొర్రుబట్ట - సీత ఎడబెట్టు | " |
| సీత బెట్టిన పైరు - చిగురాకులేసు | " |
| రంభ బెట్టిన పైరు - రవికాకులేసు | " |
| దున్నలూ దొక్కంగ - దిన్నెలా పొడుగు | " |
| ఎద్దులూ దొక్కంగ - ఎన్నెలా పొడుగు | " |
| వచ్చెరా పొలిగాడు - వరగాలి మీద | " |
| దండె గట్లల్లోన - దాగెరా పొలిగాడు | " |
| రావేలు గలవాడ రార పొలిగాడా | " |