| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
020. ఏతాము పాట
| ఆశలు ఆశలనంటును. పాపము ఆచరణలో ఏతాము రైతు పాట్లు చూడండి. |
|
ఏటికేతం పట్టి వెయి పుట్లు పండించి ఎన్నడూ మెతుకెరగరన్నా నేను గంజిలో మెతుకెరగరన్నా కాల్జేయి కడుక్కొని కట్టమీద కూసుంటె కాకి దన్నీ పాయెరన్నా - కాకి పిల్ల దన్నీ పాయెరన్నా పోరుకూ జాల్లేక పొయికాడ కూసుంటె పోరి దన్నీ పోయెరన్నా - పోరి తల్లీ దన్నీ పోయెరన్నా చుక్కపొద్దున లేచి బొక్కెనెత్తా పోగ బొక్క బోర్లా పడితిరన్నా నాదేటి బ్రతుకాయెరన్నా నేను నాడే చావకపోతిరన్నా |
| వీడెవడో ప్రత్యేకముగా దురదృష్టవంతుడు. మెతుకు మాట దేవుడెరుగును, కాకిపిల్ల తన్నులు కూడా తిన్నాడు. |