| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
021. గొడ్డలి పాట
| నరకవయ్య నరకవయ్య నరకవయ్య 'వాడేమి కొట్టాడు?' 'చింతచెట్టు' 'వీడేమి కొట్టాడు?' 'చిన్న చెట్టు' 'నీవేమి కొట్టావు?' 'ములగ చెట్టు' నరకవయ్య నరకవయ్య నరకవయ్య వాడేమి కొట్టాడు ఓహో చింతచెట్టు వీడేమి కొట్టాడు అయ్యో చిన్న చెట్టు నీవేమి కొట్టావు ఇహిహీ ములగ చెట్టు |
| ములగచెట్టు మహా పెళుసు. కొమ్మపట్టిన పటుక్కుమని విరుగును. మొదటివాడు వస్తాదు. చింతచెట్టును కొట్టినాడు. అడిగినవాడు ములగచెట్టు కొట్టినాడని "ఇహిహీ" అని నవ్వుతున్నారందరూ. వ్యవసాయము కొరకు అడవి నరుకుతున్న దృశ్యమిది. |