| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
028. ఎయ్ రా సిన్నోడెయ్ రా
| ఇలాటిదే మరొకటి. ఇది ఇటికల గుట్ట దగ్గర వినబడే పాట. ఇదిన్నీ 'కిటతక కిటతక' ఆవృతాలదే. కాని రెండు ఆవృతాలవగానే ఒక పాదము ఆగిపోయి ఇంకొక పాద మారంభిస్తుంది. |
|
ఎయ్ రా సిన్నోడెయ్ రా ఎయ్ రా జోరుగెయ్ రా దిక్కులు చూడక పక్కలొంచి మక్కువతొ పని చెయ్ రా ఎయ్ రా సిన్నోడెయ్ రా ఇంట పుట్టిన యెద్దుల్లాగు మొద్దుకింద వుండకుర ఎయ్ రా నీ జోరుగాల ॥ఎయ్ రా॥ |