| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
032. విసురురాతి పదము - 2
| తూరుపు వాకిళ్ళకు దూలాలు గావు పరమటి విండ్లకు పలకల్లు గావు మాయింటి కోడండ్లకు రోకళ్ళు గావు ధనము రాసులిచ్చె తండ్రి రామయ్య నీవైన చెప్పరాద ఆమాని పేరు అమ్మరో నీకింత విన వేడుకైతే మాడల్లొ పొయ్యేటి మరుదుళ్ళ నడుగు మాడల్లొ పొయ్యేటి మరిది సుబ్బయ్య నీవైన చెప్పరాద ఆమాని పేరు అమ్మరో నీకింత విన వేడుకైతే మైసాక్షి పక్షుల్ల మానుల్ల నడుగు అమ్మరో నీకింత విన వేడుకైతే బారాసావిటి మీది బావల్ల నడుగు అమ్మరో నీకింత విన వేడుకైతే కొలువు సావిడి మీది కొడుకుల్ల నడుగు అమ్మరో నీకింత విన వేడుకైతే నేలాన పండిన పల్లేరు చెట్టు |