| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
033. విసురురాతి పదము - 3
| నల్లకొండల నడుమ వుతికె సాకాలి మాయన్న యేసిన దట్టి పేరేమె? చింతకుంట నూలమ్మ శిరువెళ్ళ తొగరు నంద్యాల నల్లంచు లంజెపేటంచు కందనోలు కరకంచు కందిబేడంచు ఉతకరా చాకాలి వుల్లి పువ్వాలె మడసరా సాకాలి మల్లె మొగ్గాలె ఇచ్చిరా సాకాలి అన్న వాడలకి ఇచ్చేను వొచ్చేను ఇల్లు నే నెరుగ గచ్చూతొ కట్టిన గాజుస్తంభాలు సున్నమ్ము పూసిన సురటి మిద్దిళ్ళు వేపమాని యెదురిల్లు ఎద్దూలమిద్దె |