| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
044. డేరాల కోపు
| చవాల్, చవాల్, మీద ।చందమామా। చదలేటి మానొకటి ।చందమామా। చదలేటి మానుమీద ।చందమామా। సరసమాడే భోగమోళ్ళు ।చందమామా। ॥చవా॥ చల్, పొద్దుకెక్కించారు ।చందమామా। చల్, పొన్నపువ్వు డేరాలు ।చందమామా। చల్, మంచు కెక్కించారు ।చందమామా। చల్, మైనపు డేరాలు ।చందమామా। చల్, నీడ కెక్కించారు ।చందమామా। చల్, నీలిపువ్వు డేరాలు ।చందమామా। చల్, ఎండల కెత్తించారు ।చందమామా। చల్, వెండిపువ్వు డేరాలు ।చందమామా। |