| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
045. చెంచులక్ష్మి కోపు
| స్త్రీ:- | ఎక్కాడి వాడవు । యిక్కాడి కొచ్చేవు ఎక్కువగ, మాటలేరరా । మగవాఁడో చక్కంగ మళ్ళిపోరా ॥ఎ॥ వగచి నా వంక జూచి । ఎగసి గంతేసేవు ముంగటముల్లు నాటెర । మగవాఁడ వెనకాల యంబు నాటెర ॥ఎ॥ |
| పు:- | కూకోవొలె చెంచీత । కుదిరి మద్దిళ్ళ సందు కుదురూగ ముల్లు దీయవె? ఓలె చెంచు వెనకాల యంబుదీయవె ॥కూ॥ |
| స్త్రీ:- | మాటామాటకు నన్ను । ఓలె చెంచా నేవు పట్టి బాణాన వేయింతు । మగవాఁడో పంచ బాణాన వేయింతు ॥మా॥ |
| పు:- | కట్టింతు నేయిల్లు । కారండపడవిలో ఎత్తింతు పసిడికుండలు । ఓల చెంచూ వెయ్యింతు చిలుకు జవ్వాయి ॥క॥ |
| స్త్రీ:- | ఆరె? ఆరే? నీవు । ఆగడముకొచ్చేవు అదురూ, బెదురూ । లేదటరా! మగవాఁడ! ఆగడములు మానరా! ॥అ॥ |
| పు:- | సన్న బియ్యము తెచ్చి । చావట్లో ఉంచాను, వంటైనా వండగలవా? ఓలె చెంచూ! వండైన చూపగలవా? ॥స॥ |
| స్త్రీ:- | వెదురు బియ్యము తిను । మా చెంచు వారికి సన్నా బియ్యములేలరా! మగవాఁడ! సన్నబియ్యము లెందుకు? ॥వె॥ |
| పు:- | సన్న చీరలు తెచ్చి । దణ్ణాన వేసాను కట్టైన కట్టగలవా? ఓలె చెంచూ! కట్టైన చూపగలవా? ॥స॥ |
| స్త్రీ:- | పారుటాకులు గట్టు । మా చెంచువారికి సన్న చీరెలు యేలర! మగవాఁడో సన్న చీరెలేలరా ॥పా॥ |
| వెర్రి నరసింహ స్వామి. తెలుగునాటి చెంచుబిడ్డను వలచి యెంతో యాశపడినాడు! అందుకే పాడుకోగలిగినారు "అందమైన ఆడపడుచులు చెంచువారికెందుకు? పొంచి పొంచి ఓబళేశుడెత్తక పొయ్యేటందుకు" అని చెంచువారు. |