| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
047. తేరుకోపు
| ఇది రత్నాలసీమ కోలాటపు పాట. తెలంగాణపు పాటలలోనూ, రాయల రత్నాలసీమ పాటలలోనూ తెలుగుజిగి ఎక్కువేమో? పరిశీలించండి అన్నలు. |
|
వచ్చేనురా రంగ వచ్చేనురా పెన్నోబుళము తేరు వచ్చేనురా గుడ్లకోడి జంపుకోని గుజ్జంగ వండుకొని గుత్తిలోన తెల్లవార వచ్చేనురా కారుకోడె జంపుకోని కమ్మంగ వండుకోని కదిరిలోన తెల్లవార వచ్చేనురా అత్తమామ గొలిచేటి గుత్త నరసింహునకు వత్తిలేని దీపంబెట్టి వచ్చేనురా నట్టింట నుండేటి నా చిన్నబాలునకు నఱ్ఱావుపాలు బోసి వచ్చేనురా పాలుబోసి పండబెట్టి వచ్చేనురా నీళ్ళుబోసి నిద్దరూపి వచ్చేనురా |