| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
049. చెఱకుపంట కోపు
| సైరా నా గానిగిల్లా, ఇట్ల నరకలోకమేలేటి నా ముద్దు గానిగా కొత్తకోటోళ్ళోచ్చి, కొలత బెట్టించిరి గుండ్లూరు వారొచ్చి గుర్తు బెట్టించిరి బారాల వారొచ్చి సెఱకు నాటేసిరి ॥సైరా॥ బోడరెడ్డి పల్లెవారు బోడసాలు తీసిరి అంగుతోట పల్లెవారు ఆకుసాలు తీసిరి సుట్టుపట్టు వారొచ్చి సుట్టేసిపోయిరి ॥సైరా॥ గుడియాత్తం వారొచ్చి గూటలు నాటిరి వారపు కొండకు పోయి వాసాలు తెచ్చిరి నీతలకు తగలకుండా దండాలు కట్టిరి ॥సైరా॥ గానుగింట్లో ఆసెఱకు గెజ్జ వాగినట్లుంది కరణం కాడ ఆసెఱకు కంచు వాగినట్లుంది పంట పంట సక్కెరాయె వాకుదప్పిన బెల్లమాయె రాయల్ పేట వర్తకులు రంగు లేదనిరి చౌడేపల్లి వారు సరకు బాగనిరి పలమనేరు వారు పైకమిచ్చిరి పిచ్చయ్య చేతిలో పచ్చనోట్లు నీచేత నాచేత పచ్చిపోకలు ॥సైరా॥ |
| చివరకు మిగిలేవి పచ్చి పోకలు! |