| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
050. జాజిరిపాట
| జాజరిపాట చర్చరీవృత్త పరిణామము. తెలుగునాటి జాతీయఛందము - తరువోజ - కూడా సంస్కృతపు ధ్రువాపదపు అవతారమే. జాజిరిపాటలు పన్నీటి జల్లులతో కాకపోయినా, కోలాట బృందగానాల కోలాహలంతో తెలంగాణలో ఇంకా నిలిచి ఉన్నాయి. మాదిరికి రెండు. |
|
అల్లోమల్లో రాముల మల్లో రాయిగదిలె రామశిఖరమై కదిలె మున్నూటరవయి గుర్రాము కదిలె గుర్రాన్ని గొట్టి గుట్టకు బెట్టి గుర్రపుతోలు ఆర్ణపు జోడు జోడుగొంచా బోయి జోగయ్యకిస్తె జోగయ్య రెండూ జొన్నగింజలిచ్చె జొన్నగింజలు తీసుక ఏలేత్రం బోతే ఏలేత్రంలో రెండు ఎల్లెడ్లు దొరికె ఎల్లెడ్ల తీసుక వ్యవసాయం పెట్టి వలపటి దాన్నీ దాపట గట్టి దాపటి దాన్నీ వలపట గట్టి ముత్యాల ములుగర్ర తుంటిమీమోపి బంగారి పగ్గాము పనమీద మోపి ఈడ్చి కొడితే ఇరవై పుట్లు ఆర్చి కొడితే అరవై పుట్లు |