| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
052. తలపాగా
| ఈ మూడుపాటలూ చిత్తూరు మండలానివి. వీటి గతి కూడా చతురశ్ర గతియే. ముందుపాదానికి ఉరకలు వేస్తూ పోవటం గుర్తిస్తే వీటిని కూడా కోలాటం పాటలే ననవలసి వస్తుంది. |
|
అలోమల్లో రాగూల మల్లు రాగూల కేసినా రంగూపురి సాప సాపాదిరుగోలె సౌకారు కోట కోట్లెన్ని కొమ్మాలెన్ని కొమ్మాల సందూన మర్రియాకు మర్రి మర్రీకే జిల్లేడాకు జిల్లేడాకూల బెల్లముండె నీకూ దొరికాక నక్కాకు దొరికె అటుగుంజి ఇటుగుంజి జివ్వేడాకె జివ్వోడి కాపుల్ మరి మంచోళ్ళు బతుకూమాని రెండూ మామిళ్ళిచ్చిరి మామిళ్ళ దర్మాన పూతా గూసె పూతాదర్మాన కాతాగాసె కాతాదర్మాన పనలేమక్కె పనలా దర్మాన పైకాలొచ్చె పైకాల దర్మాన పాగాలొచ్చె పాగా జుట్టుకొని పల్లెకు పోతే పల్లె కుక్కాలన్ని బవ్ బవ్ మనె అప్పుడే నాకడుపు జల్లూమనె |