| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
051. జాజిరిపాట
| జాజిరి జాజిరి గాజుల పాప జాజుల్ల గూచున్న సన్నపు చాప చాపచుట్టరే సందారి కోట కోట కోటకు రెండు కొమ్మల జగ్గాల్ జగ్గాలు బట్టుక పల్లెకు పోతే అప్పుడే నావొల్లు జల్లుమానె జల్లుమన్నకాడ మల్లెల్లు రాలె మల్లెల మాదేవి తోట్లో ఉన్నాది గుబ్బాల పడుచుకు గుత్తాపు రవికె రవికె గాదురో రామాలమొగ్గ మొగ్గ గాదురో మోదుగనీడ నీడ కాదురో నిమ్మల బావి బావి కాదురో బసుమంత కూర కూర గాదురో కుమ్మరి మేను మేను గాదురో మేదరి ఇల్లు ఇల్లు గాదురో ఈగల తెట్టె తెట్టె గాదురో బియ్యపు రొట్టె |
| చాళుక్యసీమ లోని 'కాళ్ళా గజ్జా - కంకాళమ్మా' అన్నది నాగరికతలో పాతువడ్డ జాజిరిపాట యొక్క కంకాళము. లయ మాత్రము నిలిచింది నేటికి. |