| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
054. పడపడా పడపడా
| మొండిపోతూవై మోటలబడితే మాటలొచ్చెనో మల్లప్పా మల్లప్పా అని మడుగు జల్లితే శింగి గుట్టెనో శివలింగూ శివలింగా అని చింతకు పోతే గొడ్డాలి దూకే గోవిందూ గోవిందా అని గోడ కరుకుతే సెల్లాగూలె వోయీ పెరుమాళ్ళూ పెరుమాళ్ళూ అని పెండాకు పోతే ఆవు దన్నెనో హనుమాన్లూ హనుమాన్లూ అని అంగాడ్కి పోతే దొంగాలు దోసిరి దడదడా దడదడా అని దొడ్లోకి పోతే పోనూ పోకను దెబ్బల్ పడపడా పడపడా పడపడా పడపడా |