| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
056. ఏలకోపు - 2
| పుట్టమీద పాలపిట్టోయి నాసామి కొట్టబోతె తేలుకుట్టె అవునోయి మంత్రపించే జాణలంటే నాసామి మల్లెమొగ్గ పానుపేద్దు అవునోయి నేలనేలనెల్లి కూరోయి నా సామి పాల పాల బలుసు కూరోయి అవునోయి వాలుకొమ్మల సింతసిగురోయి నాసామి వండిపెడితే వలపు తీరు అవునోయి అరుగు మీద అరటిపండోయి నాసామి అడగబోతె బహుసిగ్గోయి అవునోయి పండుమీద ప్రేమలుంటే నాసామి పంతగిస్తే పండురాదా అవునోయి చక్కరాల గుట్టకాడ నాసామి చెక్కగొట్టే చిన్నవాడ అవునోయి చెక్క వచ్చి చెంపనాటె నాసామి చెప్పరాని దుఃఖమొచ్చె అవునోయి మంచినీల బావి కాడ నాసామి మందునూరే సిన్నవాడ అవునోయి మందులేలా మాకులేలా నాసామి మాటలాడితె నేను రానా అవునోయి ॥ |
| 'ఉంగరాల చేయిచూసి ఉండదేర ముందమనసు', 'ముందటేరు దున్నేవాడ', 'చెక్క వచ్చి చెంప నాటె' నన్నవి రత్నాల తునకలు. చాల పాటల్లో మెరుస్తవి. ఈ రచయితలు పేరులే పెట్టుకోరు. కాబట్టి కాపీరైటు బాధ లేదు! ఎవరు సంగ్రహించినా ఆక్షేపణ లేదు. |