| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
063. అవిరేణి పాట
| జానపదుల వివాహోత్సవాలలో రంగులతో చిత్రించి అలంకరించిన అవిరేణి ఘటమునకు ప్రాముఖ్యత ఎక్కువ. అవిరేణి, లేక అయిరేని - ఐరేని అనటం కూడా కద్దు - పాటలు తెలుగునాట విరివిగా ఉన్నవంటారు. మాకు రెండే లభించినవి. |
|
అలికిన పూసిన అరుగుల మీద ఆకుతేలు కుట్టింది నిన్ను బావయ్య చీపురు కట్టొక చేత దీపమొకచేత దిగదుడువ వచ్చిన చినబావను కుట్టె అన్నదమ్ముల బాధ తాజూడలేక అట్టె పెళ్లి పెద బావ నట్టేట దిగును కానకవారమ్మ కాలువలో దిగును ఎరుగక వారితండ్రి ఏటిలో దిగును శతమానాలకు వెళ్లిన చేడెలను జూచి కంసాలి గంగయ్య కాలువలో దిగును అవిరేణికి వెళ్లిన అక్కలను చూచి కుమ్మరి వెంకన్న గుంటలో దిగును బాసికానికి వెళ్లిన బావలను చూచి మంగలి సుబ్బయ్య మంటలో దిగును |
| ఇది అవిరేణి దగ్గర పాడునట్టి పాట కాదు, అవిరేణిని గురించిన పాట అనిపిస్తున్నది. |