| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
069. తడికా, తడికా
| భార్యాభర్తల నడుమ కలతలు వచ్చినవి. అంతలోనే బిర్రు హెచ్చినది. మాటలాడుట కూడ చిన్నతనమే. తడికకు మధ్యవర్తిత్వము ఆవహించినది. అయితే ఎంతసేపుండగలవు ఈ తాపాలు? |
|
వంకాయ, వండాను । వరికూడు వార్చాను, తినమని చెప్పవే? తడికా! తడికా! వగలాడి మాటలకు । వళ్ళంత మండింది వద్దని చెప్పవే? తడికా! తడికా! పట్టుచీర తెచ్చాను । పెట్టెలో పెట్టాను కట్టమని చెప్పవే? తడికా! తడికా! చీరకంచులు లేవు । చుట్టుచెంగులు లేవు వద్దని చెప్పవే? తడికా! తడికా! సంతలోకి వెళ్ళి । సరిగంచు చీరను అద్దాల రవికెను । అతివ తెచ్చెద కట్టుకోవే! |