| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
068. నీరాడిన చేడె
| పండిత కవుల దృష్టికందని సుందర దృశ్యము స్త్రీల పాటలలో చక్కగా కనబడుతున్నది. పల్లెటూరి నీలాటిరేవులో ఇది దినదినమూ ప్రత్యక్షమే. |
|
నీలాటిరేవంత నిగ్గు తేరింది ఏచేడె కడిగింది ఈచాయ పసుపు పచ్చి పసుపు దెచ్చి మరదలాడిందీ అణుప్పను పన్నల్ల చెల్లెలాడిందీ కొట్టుపసుపు కొమాళ్ళ తల్లియాడింది చాయపసుపు దెచ్చి పూయనేర్చిందీ శాంతమ్మ బంగారు చాయల్లదేర కొమాళ్ళ తల్లియే తాను గోపమ్మ గొంతియాడిన పసుపు గోవపూఛాయ అన్నల్ల చెల్లెలే తాను అమ్మాయి అతివ ఆడినపసుపు ఆవపువు చాయ బావల్ల మరదలే తాను అమ్మాయి పణతి ఆడినపసుపు బంగారు చాయ |
| పసుపుకుంకుమలు సౌందర్య సామగ్రియే కాని ఆరంభములో మాంగల్య చిహ్నములుగా పుట్టలేదు. పరాధీన భారతము వానిని మాంగల్య చిహ్నములుగా పరిగణించుకున్నది. నేడు తెల్లవారి వెల్లపొడులు సదాచారమై పోయినవి. దేశీయ సౌందర్య సామగ్రి వైపు మన తరుణుల దృష్టి మరలును గాక. |