| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
081. వియోగము
| ఏ కారణము వల్లనో భార్యను పుట్టినింట విడిచి వచ్చినాడు యువకుడు. ఆమె అక్కడా, ఈతడిక్కడా బాధ పడుతున్నారు. |
| ఎన్నాళ్ళో ఈ బంధికానాలు । మాకెన్నాళ్ళో | ॥ఈ ॥ |
| కదిలి వచ్చేనాడే । కారుమబ్బేసింది కలికిరో నా యెల్లి । వెలవెల బోయింది కందిన సెక్కిళ్ళ । కడవలలో బోసింది కాటుక కన్నీళ్ళు । నీలాలు నాయెల్లి | ॥ఎ ॥ |
| గడియసేపయిన నన్ । విడిసినోడు కాడు పడనార యేడాది । పాటైన కాలేదు నడిమంత్రమున యింత । మిడిమేలమైపోయె కడకు నా కాపురము । కడగళ్ళ పాలాయె | ॥ఎ ॥ |
| సీలమండా దాక । సిందాడు తలకట్టు కలువ పూలు జుట్టి । కడవంత కొప్పెట్టి పొలుపైన కుంకుమ్ము । బొట్టుకాటుక బెట్టి గున్నటేనుగు మల్లె । గునగునా నడకలు నాయెల్లి | ॥ఎ ॥ |
| వలరాజు అందాల । వన్నెచిన్నెల రాజు నిలువెత్తు నట్టిల్లు । నిండినా రాజు మెలిరాని నూనూగు । మీసాల నా రాజు కలలో రాతిరి వచ్చి । కనిపించి పోయాడు | ॥ఎ ॥ |