| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
083. తిరునాళ్ళు
| తిరునాళ్ళకు పోవటముతో సరి కాదు. అక్కడ చిక్కులెన్ని? తిరిగి వచ్చేవరకు తీర్థపు తీట తీరిపోతుంది. |
|
ఎల్తే ఎల్దువు గాని ఎంతో జాగ్రత్త యమ్మి చిన్నదాన్నై యుండి చిన్నామామయ్యతో చక్కాదానాలనూ చెన్నకేశవుల తిరునాళ్ళ నేబోయి తీర్థామాడినాక టెంకాయ నేకొట్టి దీపమెలిగించి ఉల్లడం క్రిందుగా ఊరేగుతుంటె చిలిపి వాడెవ్వడో చిన్నంగెనకొచ్చి సంకాలొ చెయి పెట్టి సరసమాడేడే యెనక్కి చూసేతలికి యెల్లీపొయినాడే మాచెర్ల చెన్నడే మాయల్ల వాడే |
| వాడెవడైనా మాచెర్ల చెన్నడే అనుకోవటములో అందమున్నది కదా! చెన్నకేశవుని ఉత్సవానికి వెళ్ళినదాయెను. ఆ చిలిపి వాడెవ్వడు కాగలడు? |