| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
086. రాయిరాయి కాగితం
| వినోదము లేనిదే జీవితము లేదు. ఆహారనిద్రాదులు శరీరమున కానందమునిచ్చిన, వినోదము మనస్సున కుల్లాసము నిచ్చును. చీకటింటికి వెలుగున్నూ, చింతలు కమ్మిన మనస్సుకు వినోదమున్నూ అందము. |
| తెలుగునాట వినోదాలకు లెక్క లేదు. సాతానిజియ్యరూ, భద్రాద్రి యాత్రికులూ, గారడీవారూ, గంగెద్దుదాసులూ, కొమ్మదాసులూ, కోయమామలూ, పెళ్ళాడే బొమ్మలూ, బుడబుక్కల వారూ, సోదివాండ్రూ, దసరా పిల్లలూ ఎవరో ఒకరు ఏడాది పొడుగునా పాటలు పాడుతూ రంజిస్తూనే ఉంటారు. |
| - అడుగో ఎర్రనిపాగా, నల్లని శరీరమూ, పచ్చని చెవిరింగులూ, రాగి దండకడియాలూ, ఎండువేళ్ళ మురుగులూ, పచ్చ పసుపూ, చంద్రవంక బొట్లూ, వీపున విల్లంబులతో కోయమామ! |
|
నీలాటి కోయమామ మాలాటి దేశమొస్తే ఉట్టిమీద పెట్టి ఊరేగించెదమూ రాయిరాయి కాగితం వాడీడి పుణ్యాన్న అబ్బాయి పుడితేను కోయరాజు పేరు పెట్టుకోండి రాయిరాయి కాగితం ఏడీలు సీడీలు ఎక్కువై కొందరు ఎనక సెక్కరాలు వెంటబడ్డాయి రాయిరాయి కాగితం దమ్మిడీ కూలోళ్ళు దగుల్బాజీ గుత్తోళ్ళు గొప్పకు రమ్మంటేను రాయిరాయి కాగితం కొప్పులు దిప్పేరు ఇంటిలో తలదువ్వి ఈధిలోకొస్తేను బేడకి దానికొప్పు బేరమైంది రాయిరాయి కాగితం |
| రాయిరాయి కాగితం అంటే ఉత్తరము రాయమని కాబోలు. |