| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
087. సాముద్రికం
| కోయమామ చెయ్యిచూచి సాముద్రికం కూడా చెప్పగలడు. |
|
సేయిసూస్తా రా పిల్ల సేతిలో బంగారు రేకున్నది; కుళ్ళాయి కుచ్చుంది కూకుని తింటావు పిల్ల; బాలెంత రూపుంది బాధ పడతావు పిల్ల; బండి మీద కల్లుంది బహు జోరుగా వుంది; తాగు తాగు పిల్ల తన్నుల్తింటావు పిల్ల ॥సేయి॥ |
| ఇవి పూర్తిగా పరమార్థమున్నూ కాదు, పరిహాసమున్నూ కాదు. అక్కడే ఉంది వీని అందము. |