| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
092. గౌరి కళ్యాణ వైభోగము
| వీరిద్దరూ మెడలకు గంధపు పూత, కొప్పునిండా పూలతో వియ్యపురాండ్రు. ఆ పసుపు బట్టల జంట నవవివాహితులు. ఈ దంపతులకు ఆశీర్వచనమూ, బహుమానమూ కోరుతున్నారు వియ్యపురాండ్రు. |
|
గౌరీ కళ్యాణ వైభోగమే లక్ష్మీ కళ్యాణ సౌభాగ్యమే | |
|
పెళ్ళీ పెళ్ళన్నాడు పెరుగూ తున్నాడే కన్నమ్మ బాస్కాలు కదలమన్నాడే | ॥గౌరీ॥ |
|
వోలేది వొంకేది వో పెళ్లికొడకా వొడికట్టు బియ్యమేవి వో పెళ్లికొడకా | ॥గౌరీ॥ |
|
మాబాబు గడ్డాము బవిరి గడ్డాము యీనుండె పేలుండె ఈతముల్లుండె | ॥గౌరీ॥ |
|
అవిరేణి కుండలకి అంచులే లేవూ పెళ్ళికొడుకు అబ్బాయికి పెదవులే లేవు | ॥గౌరీ॥ |