| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
093. పల్లెవాని స్వీయచరిత్ర
| వీడేవడు? వీపున వల, నెత్తికి సన్నగా అల్లిన తాటాకు టోపీ, చేతిలో మురికి సంచీ! |
|
నేను; పల్లోళ్ళ, కుఱ్ఱోణ్ణి బాబు; నన్ను; కొట్టొద్దు, తిట్టొద్దు బాబు; నేను; దోసేది, బుఱ్ఱ సంగడి బాబు; నేను; యేసేది యిసురు వల బాబు; నాను; పుట్టింది, పూలపల్లి పుంత; నాను; పెరిగింది, పెదపూడి సంత; నా; బాబు పేరు, జల్లకొంకు బాబు; నా; అమ్మ పేరు, మట్ట గిడస బాబు; నా; చెల్లెలు పేరు, చేదుపరిగె బాబు; నా; తమ్ముడు పేరు, రొయ్యి పీసు బాబు; నా; పెళ్ళం పేరు, యిసుక దొందు బాబు; నా; పేరు, బొమ్మిడాయి బాబు; ॥నే॥ |
| ఆ సంచిలో ఈ చేపలున్నవి కాబోలు. వీడు ఎవడో కొత్తవాడు. ఎప్పుడూ చూడలేదు. |