| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
096. బసవన్న
| అడుగో బసవన్న. బసవన్న అనంగనే వీరశైవము గుర్తుకు వస్తుంది. నంది శివుని వాహనము. బసవన్న సింహాద్రి అప్పన్న, ఏడుకొండల వెంకన్న అంశములు పుణికి పుచ్చుకున్నాడు. అప్పన్న అన్నమాట 'అహోబల' కు భ్రంశ రూపమై యుండునా? |
|
డూ డూ డూ బసవన్నా డూ డూ డూ యెంకన్నా పెబువుగారికి దండం బెట్టు బాబుగారికి భాగ్యం కలిగి పిల్లపాపలు చల్లగ వుండి పైరుపంటలు గాదులునిండి పచ్చగాను పదికాలాలుండి దానం ధర్మం చేత్తా వుండి యెండి గిట్టలు యిస్తారంట పైండి కొమ్ములు కడతారంట పట్టు శాలువ పైన యేసుకు పదిమందిలో పేరుసెప్పుకు యింటికొక్కడు యీరభద్రుడు పంచకొక్కడు బసవేస్సురుడు చల్లగ వెలసి పెబువులు వుంటె కళ్లవేడుకలు మనకంతాను |
| గంగెద్దు దాసు సన్నాయి, శ్రుతిబూరా, బిళ్ళగంటా అతనికి కాపీరైటుగా దాఖలు పడ్డవి. |