| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
097. అధ్యాత్మము
| వీరెవరో తాతగారు బియ్యపుమూట నెత్తిమీద ఉన్నప్పటికీ ముష్టిమానలేదు. ఏమంటారు? జోగయ్య తాతగారా? ఆ బియ్యము కొవ్వూరు సత్రానికివ్వడానికా? ధన్యుడు. దండము తాతగారూ. |
|
ధీరుడు విశ్వామిత్రుడు తానయోధ్యకు శ్రీరామునీ జూడవచ్చెను - అని వారుడై సౌధము జొచ్చెను - ఎదురూ గారాజు చని తోడి తెచ్చెను - మునికీ చారు సింహాసనమిచ్చెను - మహూ దారుడై పూజ యొనర్చెను - స్వామీ మీరు వచ్చినయట్టి కారణ మది దెల్పు డీ రాజ్యమైన మీకిచ్చెద ననె ను రాకేందువదన వినవె యీ చరితము కుందరదనా ॥ |
| మనసా వాచా కర్మణా మూడు యోగాలూ సాధన చేస్తున్నాడీ బడుగు బ్రాహ్మణుడు! |