| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
099. తోడు లేదన్నా
| పిల్లల్ని ఆకర్షించటానికి ఈ పాట. వారూ పాడతారు దీని మొదటి చరణాన్ని. రెండో పాట వినండి. |
|
ఎగిరే జట్కాబండి। నడిచే వొంటెద్దు బండి । గ్రుడ్లెఱ్ఱ జేసింది । గుఱ్ఱం బండీ ॥గ్రు॥ యీ మూడు జాతుల కలపుకోని । వూడ బొడచిన । రయిలు బండి । కమురు కంపు బొగ్గునీళ్ళు తోడులేదన్నా ॥ వుడికె తోటకూర । మొలచే చెంచలి కూర గ్రుడ్లెఱ్ఱ జేసింది । గులుగు కూర ॥గ్రు॥ యీ మూడు జాతుల కలపుకోని । వూడ బొడచిన , గోంగూర । కమురు కంపు రొయ్యి పీచు తోడులేదన్నా ॥ వుడికె ఉలవపప్పు । చెరిగే సెనగ పప్పు కళ్ళెఱ్ఱ చేసింది । కందిపప్పు ॥క॥ యీ మూడు జాతుల కలపుకోని । వూడ బొడచిన , పెసర పప్పు । కమురు కంపు । నేతి బొట్టు తోడులేదన్నా ॥ |