| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
098. తాతతో పరిహాసకం
| అదుగో తాతమీద పాడుతున్నాడు గారడీవాడు. ఆ పాగా, మీసము, ఎర్ర చొక్కా, బంగారు బిళ్ళల దండా. క్రీడాభిరామ కాలానికీ నేటికీ అదే వేషమితనికి. |
|
తాతో పీతో ముంజికాయ మూతో ఉల్లికోడు ఊతో తాతోయి తాత తాతోయ్! మా యింటికి రారో! మాటుంది; నూవు కూసుంటె; కురిసీల పీటుంది; నూవు నుంచుంటె; నిమ్మ చెట్టు నీడుంది; నూవు తొంగుంటె; పట్టి మంచం పరుపుంది; నీ కాకలయితె; సన్నబియ్యం కూడుంది; అందులో కొంకాయి; కూరుంది; నువ్వు సస్తేను; వల్లకాటి దిబ్బుంది. |