| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
103. లిల్లేలు పాట
| ఇది సంక్రాంతి పండుగ కనుము రోజున, మాదిగ కులం వారు గ్రామంలో సొమ్ము దండుకోటానికై, ఒక కావిడి, తట్టలు వేసుకొని, ఒక లిల్లేలు పాటకుడు కాళ్ళకు గజ్జెలు, మొలకు ధట్టి కట్టి, లిల్లేలు కత్తి భుజం మీద వేసుకొని, ఆ గుంపులో కొందరు డప్పులు వాయిస్తూ వంతపాట పాడుచుండగా పాడు పాట. |
| లింగ; తా! లిల్లే; తా లిల్లే! తాం; తత్తార పడకుండ; తానె బ్రహ్మము | ॥లింగ॥తా॥ |
| ఓరి; ఆదిమూలము, బ్రహ్మ, విష్ణు విగ్రహము మీద! ఆనందమాడే వాడెవరురా? అఖిల దేవతలకు । అభయమిచ్చి వాడు! అలనాడు గోసంగు । నేనేనురా | ॥లింగ॥తా॥ |
| పసుపు గంధము చాల । పైనిండ బూసుక! మిసిమి కత్తిని చేత । మేల్ బూనంకొని! మేల్, మేల్, సలిపిన! మేటి మృగములకెల్ల! నాకత్తి సయ్యాట । లాడునురా | ॥లింగ॥తా॥ |
| మింటి దిక్కును జూచి । మీసంబు వడివేసి! కొంటె దున్న తల । నరికేనురా! గొంకక చిందులు । గోవింద గంతులు! శంకలేక బలి । చల్లీతిరా | ॥లింగ॥తా॥ |
| అండాండ మను బిరుదు । డాసాది నాపేరు! పిండాండ మను । బిరుదు కాసె పోసి! అండ పిండ, బ్ర।హ్మాండముల కెల్లను! మెండుండుదై బాలకు । మెండాడురా | ॥లింగ॥తా॥ |
| గోసంగులు బ్రహ్మనాయని సేనలోని మాదిగలు. మాదిగవారు వీర శైవులు. శివరాత్రి నాడు కోటిఫలి క్షేత్రములో వీరి డప్పుల వాద్యాలతో చెవులు గళ్ళు పడును. |