| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
104. నాగుల చవితి
| ఆంధ్రులకును నాగులకును విడిపోని చెలిమి. అమరావతి శిల్పములలో నాగముల వంటి తలపాగలు విరివిగా కనపడును. మధ్య భారతపు బార్హతు శిల్పాలలో కూడా తలపాగలు కనపడును. అయితే ఆ తరువాతి సాంచీ, అమరావతీ, నాగార్జున కొండ చిత్రములలో విరివిగా కనపడుటను బట్టి తలపాగా తెలుగువారి అభిమానపు టలంకరణ మనవచ్చునేమో! |
| ఈ పాటలు పాములకు సంబంధించినవి. క్రూరప్రాణి అయిన పామును కూడా ఆప్తులలో చేర్చుకొని పాటలు పాడటము వినోదకరమైన వింత. |
| ఇది జోలపాటలలోనిది. |
|
నాగస్వరం, పాడితే । నాగులకు నిద్ర పుట్టలోనుంటేను । భూములకు నిద్ర అమావాస, పున్నాల । మసగలే నుద్ద పాటి మీదా కొస్తే । కక్ష కట్టేను బూకరించుచు । పడగ బుస్స కొట్టేను గుడిలో నాగులు । కొల్చిన దేవుడు |