| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
105. నాగుమయ్య ఉనికి
| ఈ పాటలో పాముల ఉనికి చెప్పబడింది. |
|
పిల్లలందరు గూడి పుల్లలేరబోతె పుల్లల్లొ వుండేటి ఓ పుల్ల నాగ ॥ ఇల్లలికి ముగ్గెట్టి మల్లెలు విరజల్లి మల్లెల్లొ వుండేటి ఓ మల్లి నాగ ॥ గొల్లభామలు కూడి చల్లల్లు చెయ్యంగ చల్లకుండ కింద చల్లనాగయ్య ॥ ఇవతల ఇది కొండ అవతల అది కొండ నట్టనడుమన కొండ నల్ల తాచయ్య ॥ |
| అనుభవానికి చక్కని వర్ణన. ఈ పాటలలో ఈ గుణము సర్వత్రా కనపడుతుంది. |