| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
107. పాము మంత్రము
| ఇది పాము మంత్రమునకు సంబంధించినట్లు కనబడుతున్నది. పాము సౌందర్యాన్ని చూడండి. |
| నాగా దిగురా! నా తండ్రి దిగురా! నాగన్న దిగురా! నాగా దిగురా! | |
| దిగు దిగు నాగన్న దివ్య సుందర నాగ నల్ల చుక్కల నాగ నా ముద్దు నాగా | ॥నాగా॥ |
| నవనవ లాడేటి నల్ల చుక్కల నాగ తళతళ లాడేటి తెల్లచుక్కల నాగ పసిమి పొరలుగల పచ్చన్ని నాగా | ॥నాగా॥ |
| కొండ చిలువలకెల్ల కోర్కెతో రాజువై పరుగుడు పాములకు ప్రభువై రంజిల్లి మొగలిచెట్లపైని మసలి తిరుగులాడి పాలు ఆరగించు పచ్చన్ని నాగా | ॥నాగా॥ |
| పక్కాను పదిహేను మచ్చాలు గలవాడ గురివింద పూసల కళ్ళయిన గలవాడ పరికి ముళ్ళ వంటి పళ్ళు గలవాడ నాగా దిగురా | ॥నాగా॥ |