| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
108. నాగదేవుని పాట
| ఆరడుగులు కలిసి వేస్తే ఆప్తులవుతారట. చేలలో తిరుగుతూ చేను చెఱిపే ఎలకలను పట్టిమింగేటి పాము ఆప్తవర్గము లోనిదే. నాగన్నకు సలహా యిస్తున్నది గృహిణి. |
|
పుట్టలో నాగన్న బూచినాగన్న ఎండలో పడుకోకు వెర్రినాగన్న కలిగినోరి కోడళ్ళు గర్వవంతూలు కలాపి జల్లేరు కాళ్ళ చిమ్మేరు ఎంగిళ్ళు జల్లేరు భంగపుచ్చేరు అటుబోకు నాగన్న చాకిరేవులకు చాకిరేవులలోన చేరి పడుకుంటె సాలిపరుగుడని సంపేరు నాగు అటుబోకు నాగన్న చెఱుకు పొలములకు చెఱుకు పొలములలోన చేరి పడుకుంటె నల్ల చెఱకు అని నరికేరు నాగు |