| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
109. గడికోపు
| ఈ నాలుగు పటలూ కేవలము వినోదములో పుట్టి వినోదమునకు దారి తీశేటివే. |
|
తానతందాన తాన, తక్కిడీ తందానతాన పచ్చ పచ్చని పక్షి యొక్కటి, నడీనెత్తిని రెక్కలొచ్చె చేతులాను గోళ్ళు వచ్చె, చెవుల సందున కొమ్ములొచ్చె॥ దాని పచ్చి మాంసమును, కత్తిపీటన కోసి కోసి బ్రాహ్మలనక బంటులనక, బంతీని భోంచేసిరంట ॥తా॥ ఎంత చెప్పిన వేదశాస్త్రం, తెలియదాయెను దాని భావం దాని భావం బట్టబయలు, దాని పేరే అరటి చెట్టు ॥తా॥ సందెకాడ లగ్గమాయె, సానిపొత్తు గర్భిణాయె తెల్లవారగ పిల్లతల్లి, పొద్దు పొడుపుకు పేరుకొచ్చె ॥తా॥ ఎంత చెప్పిన వేదశాస్త్రం, తెలియదాయెను దాని భావం దాని భావం బట్టబయలు, దాని పేరే పెరుగు కుండ ॥తా॥ ఇంటివెనక కుప్పవేసె, కుప్ప కాల అప్పుతీరె ఎంత చెప్పిన వేదశాస్త్రం, తెలియదాయెను దాని భావం దాని భావం బట్టబయలు, దాని పేరే కుమ్మరావం ॥తా॥ |
| ఇది తకిటకిటతక అని ఏడక్షరాల ఆవృతాలతో నడుస్తున్నది. కోపులన్నవి సాధారణముగా నాలుగక్షరాల ఆవృతాలతో నడుస్తవి. |