| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
111. గొర్రే గొర్రె
| పొట్టేళ్ళ గన్నతల్లి గొర్రే గొర్రె దున్నపోతును గన్నతల్లి బర్రే బర్రె వుమ్మెత్త కాయ తింటె వెర్రే వెర్రె మిరపకాయ నమిలితేను వర్రే వర్రె కాకి రెట్ట బట్ట మీద కర్రే కర్రె బురదలోను కాలేస్తె పుర్రే పుర్రె ముందటి పండ్లూడితేను తొర్రే తొర్రె తొర్రె నోట్లో అంబలేస్తే జుర్రే జుర్రె |
| "చద్దీవణ్ణం వుల్లిపాయా జుర్రో జుర్రో, దానీ మొగుడు దాన్ని కొడితే మొర్రో మొర్రో" అన్న పాటలాగున్నది ఇది. |