| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
112. చీకటిలోన
| ఈపాట పైదానికి అనుకరణ వలె కనబడుతున్నది. కాని దీని సొగసు దీనిది. |
|
చీకటిలోన వానచినుకు చిట్పట్ ఆకుచాటు ఆడపిల్ల చట్ఫట్ పూత పూచె బొండుమల్లె గప్చిప్ కోతకొచ్చె గొడ్డుమావి చల్చల్ వేళగాని వేళ వచ్చి చిర్బుర్ మేలమాడి నవ్విస్తాడు బల్బల్ కోడె వాడు కొంటెవాడు ఆంయ్ ఆంయ్ రానిదాన్ని రమ్మంటాడు సంయ్సంయ్ |