| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
122. మంచె దిగవే
| ఏలలు అన్నవి నిర్ణీత ఛందో నిర్మాణము గల పదములు. యౌవనానుభవమును సూచించే భావాలున్న పదములను ఇక్కడ ఏలపాట లంటున్నాము. ఈ అర్థముతో 'ఏలపాటలు' అన్న మాట వాడుకలో నున్నది. వీటి ఛందము మాత్రము ఏలల ఛందము కాదు. అయినప్పటికిని 'వీధి బోయెడు ప్రౌఢ విటుడు పాడెడు వింత, ఏలపదాలట్టె యాలకించు' నన్న కదిరీపతి పలుకులు ఏలపాటల కీయర్థమునే సాధించుచున్నవి. |
| ఏల పాటలలో పడుచువాండ్ర భావాల ఛాయలన్నీ కనబడుతాయి. పండిత వాఙ్మయములో ఇవి అరుదు. |
| యదాలాభముగా చూచిన పడుచును కికురిస్తున్నాడు యువకుడు. |
|
ముద్దూ మొగమూదాన ముక్కూ పోగూ దాన కాకి వేషముదాన కామంచి పడుచా మంచె దిగవే॥ అఱక చేనూలోన ఆవూలున్నవి భామ ఆలమందా నన్న అదలించ రావే మంచె దిగవే॥ కొఱ్ఱచేనూలోన కోడెలున్నవి భామ కోడెమీదానైన కోపించ రావే మంచె దిగవే॥ రూమాల మూటలో రూకలున్నవి భామ మంచె కిందకి రావె పంచుకుందామూ మంచె దిగవే॥ |