127. లగ్గో పిల్లా
| అనురక్త అయినంత మాత్రాన శకుంతల వలె లొంగిపోనక్కరలేదు. ఈ పిల్ల మాటలూ వర్తనమూ చూడండి. |
| చిన్నోడు: | నల్ల నల్ల మబ్బు మబ్బు నుండి | లగ్గో పిల్లా |
| | అగో తెల్ల తెల్ల చంద్రుడొచ్చె | " |
| | అల్లి బిల్లి తీగె చూడు | " |
| | అల్లా నేరేడు కింద చూడు | " |
| | మంచి చల్లనైన చెలమ జూడు | " |
| | నేరేడు నీడలోన | " |
| | నీ చారెడేసి కళ్లు జూపు | " |
| | మారేడు నీడలోన | " |
| | నీ బారెడంత జడను జూపు | " |
| | నిండు పున్నమ నాడు | " |
| | పండు వెన్నెల గాచె | " |
| | చిన్నారి చిన్నదాన | " |
| | నా కన్ను పండు సేయరాదె | " |
| | పొన్న పూలు ఏరి తెచ్చి | " |
| | నీ చిన్ని చేతి నియ్యరాదె | " |
| | అందమైన నీదు మోము | " |
| | ఆ చందురుడ్నె ఓడించె | " |
| | తెల్ల జొన్న రొట్టె జేసి | " |
| | మంచి వెన్న బూసి వెంట తేవె | " |
| | పల్లెదరి తోట కాడ | " |
| | మంచి తెల్లమల్లి పూలు తేవె | " |
| | నా చేను పండిపోయె | " |
| | ఇంక నీ చేను పండదాయె | " |
| | చేను చేను గలసినట్టు | " |
| | నీ మేను మేను గలపరాదె | " |
| |
| లగ్గో పిల్ల: | కారుమాట లాడబోకు | పిల్లవాడా |
| | మావారు వచ్చి చూస్తారు | " |
| | కారు మబ్బులొచ్చినాయి | " |
| | నాకు దారి చూపు లేచి వచ్చి | " |
| | కటికీ చీకట్లు కమ్మె | " |
| | చిటుకు పొటుకుమంట వాన జూడు | " |
| | అటుకు మీద పిడక లన్ని | " |
| | ఆ అటుకు మీదె వుండిపోయె | " |
| | గుడిసె మంచె కెళ్ళుదాము | " |
| | చూడు తడిసిపోయి వణుకుతాము | " |
| |
| పిల్లవాడు: | నీ చేను గుడిసె మంచెలగ్గో | పిల్లా |
| | నా చేను వొట్టి మంచె | " |
| | తెప్ప మీద తెప్ప వచ్చె | " |
| | తెప్పతోటి చినుకులొచ్చె | " |
| | అంగట్లొ మొన్న గొన్న | " |
| | కొత్త గొంగడన్న కప్పుకోవె | " |
| | దగ్గరికి రారాదె | " |
| | నీవు సిగ్గుబడితె తడుస్తావు | " |
| | వాన వెలిసి వెన్నెలొచ్చె | " |
| | మనం తానమాడి నట్టులాయె | " |
| |
| లగ్గో పిల్ల: | బట్టలన్ని తడిసిపోయె | పిల్లవాడా |
| | నేను పట్టుకోక తెచ్చుకుంట | " |
| |
| పిల్లవాడు: | నువ్వు పట్టుకోక తెచ్చుకుంటెలగ్గో | పిల్లా |
| | నేను పట్టంచు ధోతి గడత | " |
| | లగ్గమైన మనసుతోటి | " |
| | మనం లగ్గమైతె బాగుండు | " |
| |
| లగ్గో పిల్ల: | వూరు పల్లె విడిచి పెట్టి | పిల్లవాడా |
| | ఈ వూరు బయట లగ్గమేంది | " |
| | బాజాబజంతీ లేవి | " |
| | మంచి మోజు మీద సవ్వడేది | " |
| | కులము కులము కలిసినంక | " |
| | ఈ పొలము కాడ తొందరేమి | " |
| పిల్లవాడు గాంధర్వము కబుర్లు చెప్పటానికి దుష్యంతుడు గాకపోయె. పిల్ల గట్టి బ్రేకే వేసింది. |
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - laggO pillA - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )