| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
134. ముద్దుల బావ
| ఇదేదో రెండు మూడు పాటలు కలిపి కుట్టిన బొంత. ఒకటి గారడీవాని పాట లేక ఓడ పాట. రెండోది 'రాతిరి పన్నెండు గంటలకు రౌను తిరిగి నేను వస్తె' అన్నది. ఈ రెండో పాటది, 'రమణి ముద్దులగుమ్మ' అన్నది ప్రచారము గల పల్లవే. పూర్తి పాట మాకు లభించలేదు. ఇక్కడ ఇచ్చిన ఈ పాట 'ఫరవాలేదు' అనిపిస్తున్నది. ప్రేయసీ ప్రియులు లేచిపోవుట పాటకపు జనములో గలదు. ఆ సందర్భమున కిది ఉదాహరణము. |
|
ముద్దుల బావా! ఓ ముద్దుల బావా! నా రాజా నా రాజ! నా రాజనిమ్మల పండు నా ఒప్పురాల కుప్ప! నా అచ్చావు పాలు నా అప్పుడు కాచిన్నేయి ! నా అప్పడాల కఱ్ఱ నా అంటు మామిడి గున్న! నా జంట యీడకుంటావా ॥ము॥ రమణి ముద్దులగుమ్మా! ఓ ముద్దులగుమ్మా నా రాణి నా రాణి! నా రాణి ముద్దులగుమ్మ నా; గజనిమ్మపండు ! నా ఆవకాయ బద్దా నా; అప్పడాలపీట! నీ యబ్బ మీద ఆన నిన్నిడిసి నిముసముంటానా । ముద్దులగుమ్మా ॥ర॥ మనసంటే ఎంతవరకో । మాటంటే ఎంతనిరుకో వైనమేమి తెలియకుండ । వాసివన్నె చూడకుండ ఉన్న వూరులుంటేను । విన్నవారు నవ్వుతారు మనమే వూరు పోదామో! ముద్దులబావా! చిలకా గోరింకలముగా । కలిసి మెలిసి ఉందాము ॥ము॥ ఓ రంగురంగుల । రమణ రంగీ సొగసులెన్నో జరిగిపోయె । సగం ప్రేమ సాగిపోయె ఇరుగుపొరుగు వారితోను । ఇసుమంత చెప్పకుండ చిలకా గోరింకలముగా । చెంగు చెంగున లేచి మనము లింగాల పురికి పోదామె । రమణి ముద్దులగుమ్మా ॥ర॥ |