| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
135. దేశోళ్ళ చిన్నది
| బిర్రు చూపించు పిల్ల తత్త్వాన్ని వెల్లడి చేసే పాట ఇది. చిన్నవానిని చూచి నవ్వింది. మిట్టపిల్లలాగ మిడిసి మిడిసి పడుతున్నది పోపొమ్మన్నది. దీని వర్తనము విపరీతముగా నున్నదని సాహసించినాడు. 'సాహసేలక్ష్మీ' అని కదా అన్నారు? |
|
నన్నుచూసి నవ్వింది దేశోళ్ళ చిన్నదీ మెట్టాయెట్టిందీ - అహ మేలు కళ్ళదీ పెద్ద ॥మేలు॥ సట్టిసేత బుచ్చుకోని సాగెడుతుందీ మిట్టపిల్లలాగ మిడిసి మిడిసి పడుతుందీ ॥నన్ను॥ కోక కట్టుకుంది సెవ్వాకులెట్టుకుంది - కొత్త ఎల్లిక ఎల్లోరి ఎల్లు ఎల్లు మన్నదీ సల్లగ చై తాకుతేను వల్లకున్నదీ ॥నన్ను॥ |