| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
136. రాగంవాళ్ళ రంగు చిన్నది
| వీడెవడో బండవాడు. వీని మైకము జీవితావసరములను దాటినది. |
| తల్లి: |
అబ్బి పోరా గడ్డికి నా బాబు పోరా గడ్డికి నా తండ్రి పోరా గడ్డికి |
| కొడుకు: |
రాగంవాళ్ళ రంగుచిన్నది వస్తానన్నది గడ్డికి అది వస్తే పోతా గడ్డికి రాకుంటే పోనే గడ్డికి |
| తల్లి: |
అబ్బి పోరా గడ్డికి నా బాబు పోరా గడ్డికి నా తండ్రి పోరా గడ్డికి |
| కొడుకు: |
చిలకముక్కు చిన్ని కొడవలి తెస్తానన్నది గడ్డికి అది తెస్తే పోతా గడ్డికి లేకుంటే పోనే గడ్డికి |
| తల్లి: | అబ్బి పోరా గడ్డికి నా బాబు పోరా గడ్డికి నా తండ్రి పోరా గడ్డికి |
| కొడుకు: |
మొనలేని పెద్ద బొరిగె తెస్తానన్నది గడ్డికి అది తెస్తే పోతా గడ్డికి లేకుంటే పోనే గడ్డికి |
| తల్లి: | అబ్బి పోరా గడ్డికి నా బాబు పోరా గడ్డికి నా తండ్రి పోరా గడ్డికి |
| కొడుకు: |
అడుగు లేని పెద్ద గంప తెస్తానన్నది గడ్డికి అది తెస్తే పోతా గడ్డికి లేకుంటే పోనే గడ్డికి |
| తల్లి: |
అబ్బి పోరా గడ్డికి నా బాబు పోరా గడ్డికి నా తండ్రి పోరా గడ్డికి |
| కొడుకు: |
కరకంచు పెద్దకోక తెస్తానన్నది చుమ్మకి అది తెస్తే పోతా గడ్డికి లేకుంటే పోనే గడ్డికి |
| తల్లిపోరు పడలేక గడ్డికోతకు పోయినప్పుడైనా చిలకముక్కు చిన్నికొడవలి, మొనలేని పెద్ద బొరిగె, అడుగులేని గంప కావలెనట వానికి! వేరు సాధనములైనచో గడ్డికోతకు అంతు కలుగును. ఈ సాధనములతో పవలంతయు 'పని'లో గడవగలదు. |